Site icon PRASHNA AYUDHAM

టీచర్లతో డ్యాన్స్.. డీఈఓపై వివాదం..!!

Screenshot 2025 08 09 20 35 59 60 6012fa4d4ddec268fc5c7112cbb265e7

టీచర్లతో డ్యాన్స్.. డీఈఓపై వివాదం..!!

కర్నూలు జిల్లా విద్యా అధికారి శామ్యూల్ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

మహిళా టీచర్లతో వేడుకల్లో డ్యాన్స్, నవ్వులు పంచుకున్న డీఈఓ

PGTS ట్రైనింగ్ ముగింపు సందర్భంగా నిర్వహించిన వేడుక

నెటిజన్లలో మిశ్రమ స్పందనలు – ప్రశంసలు, విమర్శలు తారసపాటు

సస్పెన్షన్ డిమాండ్‌తో కొంతమంది ఆగ్రహం వ్యక్తం

కర్నూలు, ఆగస్టు 9:
కర్నూలు జిల్లా విద్యా శాఖాధికారి శామ్యూల్ పాల్ శుక్రవారం రాత్రి మహిళా టీచర్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించింది. PGTS ట్రైనింగ్ ముగిసిన సందర్భంగా జరిగిన వేడుకలో డీఈఓ సందడి చేశారు. వీడియో బయటకు రావడంతో నెటిజన్లలో భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొందరు ‘ఆఫీసర్ కూడా మనిషే’ అంటూ సపోర్ట్ చేయగా, మరికొందరు ‘బాధ్యతాయుతమైన పదవికి తగిన ప్రవర్తన కాదంటూ విమర్శించారు. డీఈఓను సస్పెండ్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

Exit mobile version