ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పశువుల దాణా పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 12: ఏలేరు వరదలతో అతలాకుతలమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆర్డీవో సీతారాం సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత రెండో అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం అందులో భాగంగా ఈరోజు వీరందరికీ 25 కేజీల బియ్యం, కూరగాయలు అందించడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి ఇంటికి 10000 రూపాయలు ప్రతి ఎకరాకు 10000 రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. విజయవాడ మాదిరిగా జిల్లాలోని అన్ని అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి ప్రతి ఇంటిని శుభ్రం చేయడం జరుగుతుందని బీ సింగ్, పెనాయిల్ ప్రతి వీధి శుభ్రం చేసి అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం రాజుపాలెం ముక్కొల్లు ప్రాంతాల్లోని కాలవ గండి కొట్టిన ప్రాంతాలను పరిశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ చదరం చంటిబాబు, బస్వ వీరబాబు, గంధం ఈశ్వరరావు, గూడె దొరబాబు, తూము కుమార్, కుంచే తాతాజీ, కుర్ల చినబాబు, గుడాల రాంబాబు, పాఠం శెట్టి మురళీకృష్ణ, కాకిలేటి రాయుడు, కాళ్ల వెంకటేష్, పోకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.