*గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మారుతినగర్ లో మహా అన్న ప్రసాద వితరణ*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతీ నగర్ 8 వ వార్డులో గల పంచముఖ హనుమాన్ వెల్ఫేర్ సోసిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సుమారు 400 మంది అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి దాతగా వార్డుకు చెందిన పనికరి స్రవంతి-మహేష్ కుమారుడు మహదేవ్ యాదవ్ నిర్వహించారు వారు మాట్లాడుతూ నవ రాత్రులు పూజలు అందుకొన్ని గణనాధుని వద్ద అన్న ప్రసాద వితరణ పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.