స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 18 ప్రశ్న ఆయుధం న్యూస్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆకుల జీవన్ సాయి తన సొంత నిధులతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల జీవన్ సాయి మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యసనం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులను ప్రోత్సహించడానికి బ్యాగులు పంపిణీ చేసిన ఆకుల జీవన్ సాయికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now