ప్రాథమిక పాఠశాలకు బెంచిల వితరణ
కామారెడ్డి మున్సిపాల్ పరిధిలో గల 13 వార్డు టెక్రియల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు 20 డిస్క్ బెంచీలను సికింద్రాబాద్ రోటరీ క్లబ్ ప్రతినిధులు మంగళవారం వితరణ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి తెలిపారు. డేస్క్ బెంచీ లు వితరణ చేసినందుకు రోటరీ క్లాబ్ ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్ జాజావ్ శంకర్రావు, మండల పి ఆర్ టి యు కార్యదర్శి స్వామి, ఉపాధ్యాయులు ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.