*విద్యార్థినీ విద్యార్థులకు మోడీ కానుక సైకిళ్ల పంపిణీ*
*బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 25 ప్రశ్న ఆయుధం*
శుక్రవారం రోజున ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి సిరిసేడు, బుజునూర్, మల్యాల గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవతరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనీ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న దాదాపు 20వేల విద్యార్థిని విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైకిళ్లను అందించడం గొప్ప విషయమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాల లో 10వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థుల ప్రయాణ, రవాణా కష్టాలు తీరుతాయాన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థుల ప్రయాణ రవాణా కష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్బంగా సైకిల్ లు తీసుకున్న బాల బాలికలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు ఆరెల్లి శ్రీనివాస్ అబ్బిడి తిరుపతి రెడ్డి ఎండీ షిరాజ్ అహ్మద్ ఖాన్ , గురుకుంట్ల సాంబయ్య, నల్ల లింగారెడ్డి, మడ్డి శ్రీనివాస్,బొమ్మాడి శ్రీధర్,మురహరి గోపాల్,మట్ట పవన్ రెడ్డి కందాల రాజేందర్, మురహరి శంకర్, తాళ్ల పాపిరెడ్డి, ఉప్పు దుర్గయ్య,కొక్కుల దేవేందర్, రేణుకుంట్ల కుమార్, గురుకుంట్ల సంజీవ్, శ్రీరాముల రమేష్, రమక్క, చిప్పతి శ్రీకాంత్, రాధారపు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు