పోటీ పరీక్షలకు పుస్తకాలు వితరణ
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 28, కామారెడ్డి :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు. గ్రామీణ పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను స్వయంగా కొనుగోలు చేయలేక ఉద్యోగాలకు దూరమవుతున్నారని విషయాన్ని గుర్తించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా 14 రకాల పుస్తకాల సెట్లను లైబ్రరీకి అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిఎన్ రావు మాట్లాడుతూ… యువతనిరుద్యోగ సమస్యను అధిగమించే విధంగాసిద్ధం కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలను సాధించే విధంగా సిద్ధం కావాలని కోరారు. కళాశాలలో కెరీర్ గైడెన్స్ పోటీపరీక్షల విభాగం నిరంతరం ఉద్యోగాలు కొరకు చేపట్టే కార్యక్రమాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని రాజగంబర్రావు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, లైబ్రరీ అధిపతి లక్ష్మణాచారి, డాక్టర్ శ్రీనివాసరావు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.