అంగన్వాడి కేంద్రంలోకుర్చీలు పంపిణీ!

●పీఎంజియువసేన ఆధ్వర్యంలో!!

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 24(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల ఆపద్బాంధవుడు, సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా కూతురు జన్మదినం సందర్భంగా శివ్వంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు పబ్బ మహేష్ గుప్త యువసేన సభ్యులుకుర్చీలు పంపిణీ చేశారు. అనంతరం పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు మాట్లాడుతూ ఆ భగవంతుని దయవల్ల పబ్బా ఆరాధ్యనిండు నూరేళ్లుఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట తాజా మాజీ గ్రామఉపసర్పంచ్ రాజిపేట పద్మ వెంకటేశ్వర్, బాసంపల్లి రామా గౌడ్, గొల్ల శ్రీనివాస్ యాదవ్, పత్రాల త్రినేష్ గౌడ్, ముదగల రాజు, హరి, నవీన్, ఖదీర్, నాగేష్,
షేక్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now