ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 30(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలంలోని వివిధ గ్రామాలలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమానికి మండల కేంద్రంలోని శివ్వంపేట లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఒక వరం లాంటిదని అన్నారు. శివ్వంపేట మండలంలో సుమారుగా 51 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు అయినాయని అన్నారు. అనంతరం తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, తాజా మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కాలేవని అన్నారు. వారికి త్వరలోనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా శివ్వంపేట మండలంలోని రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, శివ్వంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు యాదగౌడ్ రాజశేఖర్, వీరేశం, నాగేశ్వరరావు, పత్రల శ్రీనివాస్ గౌడ్, రాజీపేట వెంకటేశ్వర్, మరియు మండలంలోని వివిధ గ్రామాల మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.