*దివ్యాంగులకు ఉచితంగా పరికరాల పంపిణీ*
*రేపు బ్లాక్ ఆఫీస్ కూడలిలో కార్యక్రమం*
*రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి*
*ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ
షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా దివ్యాంగుల కోసం అవసరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం జూన్ 10వ తేదీ మంగళవారం నాడు బ్లాక్ ఆఫీస్ ముఖ్య కూడలిలో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దివ్యాంగత సర్టిఫికెట్ (సదరం), UDID కార్డు జిరాక్స్ పత్రాలను వెంట తీసుకొని రావాలన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పారదర్శకంగా పరికరాల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు..