స్త్రీనిధి రుణ సహాయంతో ఎలక్ట్రిక్ ఆటోలు–బైకుల పంపిణీ
లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబనకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ భరోసా
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22
కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్త్రీనిధి రుణ సహాయం కింద ఎలక్ట్రిక్ ఆటోలు, బైకులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం కలెక్టరేట్ లో పంపిణీ చేశారు. SHG మహిళల పేదరిక నిర్మూలనలో స్త్రీనిధి కీలకంగా పనిచేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం 11 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల సహాయంతో 2 ఎలక్ట్రిక్ ఆటోలు, 9 ఎలక్ట్రిక్ బైకులు అందించబడినట్లు తెలిపారు. గ్రామీణ మహిళల ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం పెరగడానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో DRDO విజయలక్ష్మి, స్త్రీనిధి అధికారులు హాజరయ్యారు.