*విద్యార్థులకు పరీక్ష ఫ్యాడు పెన్నులు స్కెలు పంపిణీ*
*యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు*
*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులు పెన్నులు స్కేలు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు జమ్మికుంట పట్టణం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 250 మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కెల్ విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చదువుతోనే బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని 10 వ తరగతి తోనే భవిష్యత్ కు తొలిమెట్టని అదే విధంగా పదవ తరగతి లో 100% ఉత్తిర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే జమ్మికుంట మండలం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అదే విధంగా 10/10 సాధించిన విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, జమ్మికుంట ఇల్లందకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోలుగురి సదయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక ఫిషరీష్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పింగిలి రాకేష్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్, మండల ఉపాధ్యక్షుడు రాచపల్లి సాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పంజాల అజయ్, చెన్నావేన రమేష్, శనిగరపు తరుణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్, దిడ్డి రాము, శ్రీహరి దొడ్డే నవీన్, ఏభూషి అజయ్, పాతకాల రమేష్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.