నేడు చేప మందు పంపిణీ

*నేడు చేప మందు పంపిణీ*

*హైదరాబాద్: జూన్ 08*

ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది.

పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టారు.మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటంబ సభ్యులు ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈసారి సభాపతి గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదగా పంపిణీ ప్రారంభం అయింది.

చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 13 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment