పూర్వ నివాసి తాండ్ర వెంకట్రావు విద్యార్థులకు ఉచిత సైకిల పంపిణీ”

ములకలపల్లి ( ప్రశ్న ఆయుధం)డిసెంబర్ 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట పాఠశాల పూర్వ నివాసి అయిన
తాండ్ర వెంకట కృష్ణ రావు (అడ్వకేట్ )
(ఎన్ఆర్ ఐ) డాక్టర్ మురళి కృష్ణ రావు, డాక్టర్ పొట్లపల్లి రాజేందర్
దాతల సహకారంతో సైకిల్లు కొనుగోలు ఆనందోత్సాహంలో చిన్నారులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉచిత సైకిల్ పంపిణీ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు బి శంకర్

పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. పలువురు దాతలు, సంస్థల సహకారంతో తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ లను పూర్వ నివాసి తాండ్ర వెంకట కృష్ణ రావు (అడ్వకేట్) చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ప్రధానోపాధ్యాయుడు స్ఫూర్తితో.తిమ్మంపేట ప్రధానోపాధ్యాయులు బి శంకర్ విద్యార్థుల అవసరాన్ని గుర్తించి, సైకిళ్ల పంపిణీ చేయాలని కృతనిశ్చయంతో చేసిన ప్రయత్నం విజయవంతమైంది. జలగం లీలా సంతోష్ కుమార్ .జలగం చంద్ర శేఖర్ దాతల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
స్ఫూర్తినిచ్చే కార్యక్రమం

విద్యార్థినీ విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం స్పూర్తి నిచ్చేదని ప్రధానోపాధ్యాయులు బి శంకర్ అభిప్రాయపడ్డారు. పాఠశాలకు నడిచొస్తూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల అవసరం మేరకు తీసుకున్న నిర్ణయానికి దాతలు దాతృత్వం తోడవడంతో ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమానికి తిమ్మంపేట పాఠశాల వేదికైంది. ఈ సందర్భంగా ప్రధాన ప్రధానోపాధ్యాయులు బి శంకర అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు , పాఠశాల అభివృద్ది కమిటీ సెక్రటరీ జలగం చంద్ర శేఖర్ , సభ్యులు మధుసూదన్ , గ్రామ పెద్దలు కాంతారావు , భాస్కర్ , జోగయ్య ., ఉపాధ్యాయులు నిర్మల , సురేష్ , ప్రశాంత్ , ముత్తేశ్వరరావు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now