నేతాజీ నగర్ కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 26 శేరిలింగంపల్లి ప్రతినిధి బబికాంత్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అధ్యక్షతన జిహెచ్ఎంసి వారి సహకారంతో నేతాజీ నగర్ కాలనీలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ నిర్వహించడం జరుగుతుందని
అన్నారు. ఈనాటి సమాజంలో
వాడ వాడలో వీధి వీధినా ఇంటింటికి కెమికల్స్ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించి తదుపరి చెరువులలో నదులలో వాగులలో నిమజ్జనం చేస్తారు. దీనివల్ల నీటి కాలుష్యమే కాకుండా అనేక రకాలుగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందరం పూజించే ఆ విఘ్న దేవుని మనం అందరం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మట్టి విగ్రహాలను పూజించి భక్తితో భజనలు చేస్తూ నిమజ్జనం చేయాలని అన్నారు. రణగొణ ధ్వనులతో డీజే లతో అడ్డంగా చిందులేస్తూ భక్తి భావంతో కాకుండా నలుగురికి ఇబ్బంది కలిగే విధంగా బాణసంచా పేలుస్తూ గొప్పగా భక్తి భావం చూపిస్తున్నట్టు నిమజ్జనం పూర్తిగా గావిస్తున్నారు. అలాకాకుండా భక్తితో భజనలు చేస్తూ ఆ విఘ్నదేవుని మనస్ఫూర్తిగా కొలుస్తూ విఘ్నాలన్ని తొలగిపోవాలని పూజించాలి అన్నారు నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జిహెచ్ఎంసి సూపర్వైజర్ భరత్ రెడ్డి సూపర్వైజర్ రాందాస్ మరియు సిబ్బంది మరియు నేతాజీ నగర్ అసోసియేషన్ సభ్యులు శంకర్ మార్వాడి, మణికంఠ, మురుగన్ వేలు, సాయిచంద్ పైల్వాన్, అశోక్, రాజు, మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొని మట్టి వినాయకుడిని పంపిణీ చేశారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్