ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

– కామారెడ్డి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

నిరంతరం బీసీ ల కోసం పరితపిస్తూ,బీసీ లకు రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేయడంలో , కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణన తో పాటు కులగణన చేస్తామని హామీ ఇవ్వడంలో ముఖ్యభూమిక పోషించిన జాజుల శ్రీనివాస్ గౌడ్ కి అభినందనలు తెలియచేస్తూ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు ముదిరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మారోజు మోహనా చారి,హాజీ అబ్దుల్ అజీజ్,జొన్నల రమేష్,భిక్కనూరు మండల అధ్యక్షులు పన్నాస నర్సింలు, కామారెడ్డి మండల అధ్యక్షురాలు సిరిసిల్ల భారతి,కామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఏ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment