సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్బంగా గర్భిణీ స్త్రీలకు తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు. శుక్రవారం తీన్మార్ మల్లన్న టీమ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న పుట్టిన రోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న అని, గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి దాదాపు 100 అక్రమ కేసులు పెట్టినా.. క్యూ న్యూస్ వేదిక పైన గత పాలకుల అరాచకాలను బయట పెట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రభు, అబ్దుల్, ఆనేగుంట శ్రీకాంత్, నరేష్, ఆసుపత్రి సిబ్బంది బాలస్వామి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్బంగా పండ్లు పంపిణీ
Updated On: January 17, 2025 7:09 pm
