పారిశుద్ధ కార్మికులకు వస్తువుల పంపిణీ
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 16, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా టేక్రియాల్ పెద్ద చెరువు దగ్గర నిర్వహిస్తున్న శోభాయాత్రలో భాగాంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ సూచన మేరకు సోమవారం రేడియం జాకెట్, నైలాన్ గ్లోసెస్, సిమ్మింగ్ ట్యూబ్స్, నైలాన్ రోప్, ఆప్రాన్స్, లైఫ్ జాకెట్ వస్తువులను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్ర శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ కౌన్సిలర్లు పంపరి లతా శ్రీనివాస్, ఆకుల రూపా రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.