Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులకు హాకీ స్టిక్స్ పంపిణీ

IMG 20240822 WA0293

జన్మదినం సందర్భంగా విద్యార్థులకు హాకీ స్టిక్స్ పంపిణీ

ప్రశ్న ఆయుధం, ఆగష్టు 22, కామారెడ్డి :

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కుమారుడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ జన్మదినం సందర్బంగా గురువారం కామారెడ్డి గంజ్ హైస్కూల్ లో విద్యార్థి, విద్యార్థినులకు హకీ స్టిక్స్, బ్యాడ్మింటన్ షటిల్ బ్యాట్స్ పంపిణీ చేసారు.
46వ వార్డు కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మానసిక ఒత్తిడి లేకుండా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఆటో యునియన్ లడ్డు ఆధ్వర్యం లో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉరుదొండ వనిత రవి, నిమ్మ మోహన్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, పుట్నాల శ్రీనివాస్, లక్కపత్ని గంగాధర్, ప్రతిభ రమేష్, చింతల శ్రీనివాస్, కౌన్సిలర్స్ ప్రసన్న కుమార్, భూక్య రాజు, పొదర్ల రాజు, సురేష్, శ్రీనివాస్ , లక్ష్మన్, నర్సింగ్, భాస్కర్, సర్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version