వరద బాధితులకు సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమియోపతి నివారణ మందులు పంపిణీ

కామారెడ్డి వరద బాధితులకు సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమియోపతి నివారణ మందులు పంపిణీ

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

IMG 20250903 WA0009సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కామారెడ్డిలో సంభవించినటువంటి వరద బాధితులకు ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి సహకారంతో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చినుకాని శివప్రసాద్ పట్టణ కేంద్రంలో వరదలు సంభవించిన ప్రాంతాలలో సందర్శించి వారికి డాక్టర్ల బృందంతో కలిసి హోమియోపతి నివారణ మందులను (దాదాపుగా 70 కుటుంబాలు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులకు సహస్ర ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ నివారణ మందులు తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకాని శివప్రసాద్, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మహేష్, ఐఐహెచ్ పి స్టేట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ హరీష్, కోఆర్డినేటర్ సీలివేరు సైదులు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment