ఇందిరాగాంధీ జయంతి ఇందిరమ్మ చీరల పంపిణీ 

ఇందిరాగాంధీ జయంతి ఇందిరమ్మ చీరల పంపిణీ

 

 

కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు

 

ఆడబిడ్డలకు సారే, చీర పెట్టడం తెలంగాణ సాంప్రదాయ

 

 

మహిళల ఉన్నతికై తెలంగాణ ప్రగతి

 

ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి

 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా నవంబర్ 19

 

 

మహిళల ఉన్నతి–తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సంబంధిత అధికారులతో మినీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేశారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

 

కామారెడ్డి జిల్లాలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చీరల పంపిణీ జరగనుందని, ఈ ప్రక్రియ పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు.

 

18 ఏళ్లు పైబడిన మహిళలందరూ అర్హులే అని, పౌర సరఫరాల డేటా ప్రకారం 3,11,922 మంది మహిళలు జిల్లాలో ఇందిరమ్మ చీరలకు అర్హులని వివరించారు.

ప్రతి మండలంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

 

 

 

కోటిమంది మహిళలకు కోటి చీరలు లక్ష్యం

 

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ ప్రారంభించామన్నారు.

“ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం— అందుకే ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నామని ప్రతి ఆడబిడ్డకు సారే, చీర పెట్టడం తెలంగాణ సాంప్రదాయమని ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక అధికారిని నియమించి అన్ని మండల కేంద్రాల్లో విడుదలవారీగా ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని అన్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో యూనిఫారం కుట్టు పని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ శిల్పారావంలో మూడు ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బసారు ఏర్పాటు చేశామని ఆన్లైన్లో మార్కెట్ కోసం అమేజాన్ తో సంప్రదించామని తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు చేయూత కోసం అనేక ఉత్పత్తుల్లో గుర్తింపు తెచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా వివరించాలని గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందని అలాగే పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ విక్టర్, మదన్మోహన్, డిఆర్డిఓ సురేందర్, ఇందిరా మహిళా శక్తి సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now