కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు1
కన్కల్ గ్రామంలో శుక్రవారం రోజున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి, చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా లబ్ది పొందిన వారు, కౌడి బాలవ్వW/O శివయ్య, బర్ల సవిత W/O అంజయ్య, ఇంతియాసు బేగం,D/O మౌలానా, చాకలి లక్ష్మి W/O చిన్న సాయిలు,కి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి చెక్కులు అందుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, మల్లేశం, మండల కోఆర్డినేటర్, గడ్డం ప్రతాపరెడ్డి, కన్కల్ గ్రామ అధ్యక్షులు, సరుసాని భూపతి రెడ్డి, ఉపాధ్యక్షులు సాకలి బాలరాజు, ఇందిరమ్మ కమిటీ మెంబర్, సాకలి నడిపి సాయిలు, మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.