Site icon PRASHNA AYUDHAM

గాంధారి రైతు వేదికలో* *కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ*

IMG 20251122 WA0032

*గాంధారి రైతు వేదికలో* *కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ*

*ఏల్లారెడ్డిలో సంక్షేమ* *పరిపాలన ప్రతిరూపంగా కార్యక్రమం*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 22

గాంధారి ఏల్లారెడ్డి శాసన సభ్యులు గౌరవ శ్రీ మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ పథకం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,“ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా చేరవేయడం మా ప్రధాన లక్ష్యం. కళ్యాణ లక్ష్మి పథకం వేలాది కుటుంబాల ఆర్థిక భారం తగ్గించే దిశలో ఒక పెద్ద సహాయంగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు. లబ్ధిదారులు చెక్కులు స్వీకరించిన తరువాత తెగ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో రేణుక చౌహన్ ,ఏం సి చైర్మన్ బండారి పరమేష్ ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి తూర్పు రాజులు ,లైన్ రమేష్ ,మాజీ ఎంపిటిసి కామెల్లి బాలరాజ్ ,సంగని బాబా, నీళ్ల రవి ,గడ శంకర్ ,బొమ్మని బాలు ,స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు

Exit mobile version