కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ

*కెసిఆర్ ప్రవేశపెట్టిన మహత్తర పధకం కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్*

*డిసెంబర్ 9 తర్వాత జరిగిన వివాహాలకు తులం బంగారం ఇవ్వాలి*

*చెక్కుల పంపిణీ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 7*

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బిడ్డల పెళ్లిల్ల కోసం ఉన్నతంగా ఆలోచించి మహోత్తరమైన కల్యాణ లక్ష్మి -షాది ముబారక్ అనే పథకాన్ని తీసుకువచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండలంలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి చెక్కున పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు కళ్యాణ లక్ష్మి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం ఉంటుందని కెసిఆర్ ఆలోచనతో కల్యాణ లక్ష్మి పథకం 50వేలతో మొదలై క్రమేపి 75 వేల నుంచి లక్ష 116 లు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో భాగంగా కళ్యాణ్ లక్ష్మీ పథకం కింద లక్ష 116 లతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని వెంటనే దానిని లబ్ధిదారులందరికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు. దీంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చిన అన్నా అంటే నేనున్నానంటూ ఇలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి పిఎసిఎస్ చెర్మన్ పొనగంటి సంపత్ మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ తహసిల్దార్ రమేష్ బాబు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి రూరల్ సిఐ కిషోర్ ఎస్సైలు వివేక్ జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now