కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
-పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యుడు నేనావత్ బాలు నాయక్
హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:
చింతపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై,కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ నుంచి మజురైన ఒక్కొక్కరికి 100116 రూపాయల చొప్పున లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యే ని మండల తహసీల్దార్ శాలువాతో సత్కరించారు.
కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళికి వరంగా మారిందన్నారు. అలాగే దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు.
అదే విధంగా ముఖ్యమంత్రి సహా నిధి నుంచి మంజూరైన 31 చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈమాజీ ఎమ్మెల్యే ఉజ్జయిని యాదగిరి రావు,నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం,మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి,మాజి ఎంపీపీ భవాని పవన్ కుమార్, మాజి జెడ్ పి టి సి హరి నాయక్,మాస భాస్కర్,చింతపల్లి మాజి సర్పంచ్ గిరి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్,కొండల్ యాదవ్,సదనదన్, పి ఏ సి ఎస్ చైర్మన్ వెంకటయ్య, జాల నర్సింహా రెడ్డి, ఎమ్మార్వో రమాకాంత్ శర్మ,పలువురు ప్రజప్రతినిధులు,కార్యకర్తలు, నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన విభాగ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
by kana bai
Published On: October 22, 2024 10:11 pm