కళ్యాణం లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ

*కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ*

*డిసెంబర్ 9 నుంచి జరిగిన వివాహాలకు లక్ష 116లతో పాటు తులం బంగారం ఇవ్వాలి*

*హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బిడ్డల వివాహాల కోసం ఉన్నతంగా ఆలోచించి గొప్పదైన కల్యాణ లక్ష్మి -షాది ముబారక్ అనే పథకాన్ని తీసుకువచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు గురువారం హుజరాబాద్ నియోజకవర్గంలో రెండవ రోజు జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం ఉంటుందని కెసిఆర్ ఆలోచనతో కల్యాణ లక్ష్మి పథకం 50వేలతో మొదలై క్రమేపి 75 వేల నుంచి లక్ష 116 లు చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో భాగంగా కళ్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష 116 లతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని వెంటనే దానిని లబ్ధిదారులందరికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే డిసెంబర్ 9 తర్వాత వివాహాలు చేసుకున్న వారందరికీ లక్ష 116 లు తులం బంగారం ఇవ్వాలని అన్నారు. దీంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చిన అన్నా అంటే నేనున్నానంటూ ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఎంపీడీవో కే భీమేష్ తహసిల్దార్ రమేష్ బాబు ఎంపిఓ వెంకటేశ్వర్లు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now