*గణపతి నవరాత్రుల ఉత్సవంలో మహా అన్న ప్రసాదం*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల 24వ వార్డు, గణేష్ నగర్ లో గణపతి మండపం వద్ద మండప చైర్మన్ రాజేష్ ఠాగూర్ రాకేష్ ఠాగూర్ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు ప్రజలకు మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు పూర్వం బ్రిటిష్ కాలంలో హిందూ ప్రజలు కలుసుకోవడానికి వీలు ఉండేటట్లు లోకమాన్య తిలక్ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారని క్రమానుసారం పూజలు నిర్వహిస్తూ ఒకరి కష్టసుఖాలను ఒకరు పంచుకునే విధంగా ప్రజలందరూ భూమికూడి పూజలు చేయడం జరుగుతుందని ప్రస్తుత తరుణంలో హిందువులంతా ఏకమై భారత దేశ ఐక్యతను చాటాలని కోరారు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఇటుకల స్వరూప, గర్రెపల్లి నిరూపరాణి ఇల్లందుల శ్రీనివాస్,భక్తులందరూ ఆ గణనాధుని ఆశీస్సులు పొందారు అనంతరం స్వామివారి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు