భీర్కూర్ లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల‌కు మెడికల్ కిట్‌ల పంపిణీ

శబరిమల మహాపాదయాత్రకు బయల్దేరిన అయ్యప్ప మాలధారణ స్వాములకు ఆరోగ్య రక్షణ చర్యలు, సుమారు 1400 కిలోమీటర్ల దూర ప్రయాణం ముందునే జాగ్రత్తగా ఏర్పాటు

ఇమ్యూనిటీ, నొప్పుల నివారణకు ఉపయోగపడే మెడికల్ కిట్లు అందజేత

గురుస్వామి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తుల సమూహం పాల్గొనడం,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సితలె రమేష్, సేవా సభ్యులు సమన్వయం

భీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శబరిమల మహాపాదయాత్రకు బయల్దేరిన అయ్యప్ప మాలధారణ స్వాములకు ఆరోగ్య రక్షణ చర్యల భాగంగా మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భీర్కూర్ నుండి సుమారు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం పాదయాత్రగా బయల్దేరిన భక్తులకు ఈ కిట్లు అందజేశారు.

ఇమ్యూనిటి పెంపు, శరీర నొప్పుల నివారణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కిట్లు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వామి సుధాకర్ యాదవ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సితలె రమేష్, ట్రిజరర్ మేకల గాలయ్య, జోన్ చైర్మన్ కొట్టురి సంతోష్ సెట్, సీనియర్ లయన్స్ సేవాకులు మేకల విఠల్, వీరయ్య సెట్ తదితరులు పాల్గొన్నారు.భక్తి, సేవ, ఆరోగ్య పరిరక్షణ కలబోతగా ఈ కార్యక్రమం భక్తుల్లో ఉత్తేజం నింపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment