వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ
గజ్వేల్, 13 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో చిన్నారులకు పతంగులు, దారం, చరక ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా చిన్నారులకు పతంగులు అందజేయడం సంతోషంగా ఉందని పతంగులు ఎగురవేయడం ఆనందం ఉంటుందని, విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అలవర్చుకొని తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, ఉపాధ్యక్షుడు మల్యాల భద్రయ్య, కైలాస ప్రశాంత్ కాశీనాథ్,వాసవి క్లబ్ సభ్యులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.