– నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
గ్రామ ప్రజలతో సమావేశం.. అర్జీల స్వీకరణ
అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.ఒకరోజు పర్యటనలో భాగంగా బొమ్మనహాల్ మండలం నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్వయంగా ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు. రచ్చబండ తరహాలో నేమకల్లు గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి సమావేశమౌతారు.
సీఎం పర్యటన షెడ్యూల్..*
– శనివారం ఉదయం 11 గంటలకు: తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రాయానికి బయలుదేరుతారు.
11.40: విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు బెంగళూరు విమానాశ్రాయానికి చేరుకుంటారు.
12.45: బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
12.45 గంటల నుంచి 12.50 గంటల వరకూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
– 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు.
1.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.25 గంటలకు నేమకల్లు ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు.
1.25 గంటల నుంచి 1.55 గంటల వరకూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
1.55 గంటల నుంచి 2.00 గంటల వరకూ నేమకల్లులోని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత 3.05 గంటల వరకూ స్థానిక ప్రజలతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం 3.10 గంటలకు నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకొని 3.15 గంటల వరకూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
3.45 గంటలకు హెలిక్యాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు.