బడిబాట కార్యక్రమంలో భాగంగా కరపత్రాల పంపిణీ

బడిబాట కార్యక్రమంలో భాగంగా కరపత్రాల పంపిణీ

ప్రశ్న ఆయుధం జూన్09: శేరిలింగంపల్లి ప్రతినిధి

కొండాపూర్: అంజయ్య నగర్ లోని ఎమ్ పీపీఎస్. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీ. అర్చన ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా నాలుగవరోజున అంజయ్య నగర్ ఎమ్ పీపీఎస్. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం అంజయ్య నగర్ లో ఇంటింటికి వెళ్ళి కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగ వారు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను అందింస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లయితే కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరేవిధంగా పోత్సహిస్తు, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు

సానుకూలంగా స్పందింస్తూ పాఠశాలకు చేరుకుని విద్యార్థులను చేర్పించారు. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీ. అర్చన, ఉపాధ్యాయులు మోహన్ కుమార్, కళావతి, ప్రభంజన్ రెడ్డి, యాదగిరి, లలిత, సుమ ,అంగన్వాడీ టీచర్స్ ,కమ్యూనిటి వార్డ్ మెంబర్ నరసింహ, కమ్యూనిటి పెద్దలు, అంజనేయులు,రవి,విక్రమ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now