ఈస్ట్ గాంధీ నగర్‌లో మొక్కల పంపిణీ
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 5
నాగారం మున్సిపాలిటీ పరిధి 15వ వార్డు, ఈస్ట్ గాంధీ నగర్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని కాలనీ వాసులకు మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడానికి మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.