అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ  

అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ

అప్స స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం

చిక్కడపల్లి సిఐ రాజు నాయక్

ప్రశ్న ఆయుధం సికింద్రాబాద్ అక్టోబర్ 16: అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లలిత శ్రీ మహేంద్ర కుమార్ దంపతుల సహకారంతో చిక్కడపల్లి ఆంధ్ర విద్యాలయ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సదాశివుడు, అధ్యక్షతన చిక్కడపల్లి సిఐ రాజు నాయక్, ముఖ్య అతిథిగా పాల్గొని లలిత శ్రీ మహేంద్ర కుమార్, చేతుల మీదుగా విద్యార్థులకు భోజనం ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ రాజు నాయక్, మాట్లాడుతూ లలితశ్రీ మహేంద్ర కుమార్ విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ చేయడం ఇటువంటి కార్యక్రమాలు అప్స స్వచ్ఛంద సంస్థ చేపట్టడం ఎంతో అభినందనీయమని విద్యార్థులు కూడా చిన్నతనం నుండే సేవా గుణములు అల మార్చుకోవాలి మంచిగా చదువుకొని ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని చదువు చెప్పిన గురువులను కన్న తల్లిదండ్రులను గౌరవించాలి అని ముందు తరాలకు ఆదర్శంగా ఉంటూ మీరు మంచి మంచి స్థాయిలో ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నాగేశ్వరరావు, జయంతి సందర్భంగా పేద విద్యార్థులకు అప్సా స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్లేట్స్ పంపిణీ కార్యక్రమం మా పాఠశాలను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మునుముందు దాతల ద్వారా పాఠశాల అభివృద్ధి దిశగా అప్స స్వచ్ఛంద సంస్థ తన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్స స్వచ్ఛంద సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్, మాట్లాడుతూ మా సంస్థ వివిధ దాతల సహకారంతో విద్యార్థులకు సహాయ కార్యక్రమంలో కాకుండా వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు, విద్యార్థులకు మత్తు పాన్యాలపై మొబైల్ ఫోన్లపై వ్యసనాలు కాకుండా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం దాత లలితశ్రీ, లలితమాట్లాడుతూ మా నాన్న ఎం నాగేశ్వరరావు, జయంతి సందర్భంగా విద్యార్థులకు నా వంతు సహాయంగా ఈ కార్యక్రమం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది అని నా మిత్రుడు బొట్టు రమేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో భాగంగా అప్స స్వచ్ఛంద సంస్థ క్షేత్ర సహాయరాలు, ముస్తాల లావణ్య, మాట్లాడుతూలలిత శ్రీ పార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న, మానవసేవే మాధవసేవ అని నిజం మనోనేత్రంతో చూసేవారికి తెలుస్తుంది, లలిత శ్రీ మహేంద్ర ఇంత మంచి కార్యక్రమం మా అప్సా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేయడం ఎంతో గర్వకారణం అని అన్నారు, ఎంతో బిజీగా ఉండే చిక్కడపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భోజనం ప్లేట్లు పంపిణీ చేసినందుకు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అప్స కోఆర్డినేటర్ రమేష్, కు తనకు సహకరించిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment