Site icon PRASHNA AYUDHAM

అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ: సీఎం రేవంత్‌రెడ్డి..!!

IMG 20250721 WA2040

*_అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ: సీఎం రేవంత్‌రెడ్డి..!!_*

హైదరాబాద్‌: జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్‌ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.

”రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్‌ ఉందో బయట నోటీస్‌ బోర్డు పెట్టాలి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించాలి.

ఇప్పటి వరకు 7లక్షలకుపైగా కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి. అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ జరగాలి. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. ఆందోళన అవసరం లేదు” అని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

Exit mobile version