25న నేలకొండపల్లి ఏఎంసీ యార్డులో రేషన్ కార్డుల పంపిణీ

ఈనెల 25న నేలకొండపల్లి ఏఎంసీ యార్డులో రేషన్ కార్డుల పంపిణీ25న నేలకొండపల్లి ఏఎంసీ యార్డులో రేషన్ కార్డుల పంపిణీ

  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈనెల 25న నేలకొండపల్లి మండలం ఏఎంసీ యార్డులో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరుకానున్నారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కావున మండలంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రేషన్ కార్డు లబ్ధిదారులందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.*

 

#postbyteam

Join WhatsApp

Join Now

Leave a Comment