*ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలకు బియ్యం పంపిణీ*
*హుజురాబాద్ ఏప్రిల్ 21 ప్రశ్న ఆయుధం*

నియోజకవర్గ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన కుత్తాడి జీవన్, కొలుగూరి కుమార్‌లు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త, జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ వారి కుటుంబాలకు ఎంతో కొంత సహాయంగా బియ్యం తన టీమ్ ద్వారా అందజేశారు. జీవన్ ఫ్యామిలీకి 50 కేజీలు, కుమార్ కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని సబ్బని వెంకట్ టీం సభ్యులు సోమవారం పంపిణీ చేశారు మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబాలకు సానుభూతి తెలిపారు
Post Views: 14