శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాక్షల పంపిణీ
కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ పరిధిలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గ్రామం లింగాపురం లో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాశీ నుండి 1100 వందల పంచముఖి రుద్రాక్షలు కోడిప్యాక సాయిరాం కల్కి నగర్ వాస్తవ్యులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యఅతిథిగా 11 వ వార్డ్ కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ హాజీరై మాట్లాడుతూ భగవంతుని కృప ఒక్కరిపై కాకుండా అందరిపై ఉండాలని ఆలోచనతో రుద్రాక్షలను పంపిణీ చేయడం కోడిపాక సాయిరాంకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొమిరెడ్డి పెద్ద నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు , నారాయణ రెడ్డి , భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.