మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ లో వాకింగ్ టీం గురుకుల మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురుకుల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా బాలికల ఖోఖో టీం సభ్యులకు ప్రత్యేక టీ షర్ట్ లను ప్రిన్సిపాల్ సమక్షంలో బాలికలకు బహుకరించారు. ఈ సందర్భంగా తమ విద్యార్థులకు ప్రోత్సాహకంగా వాకింగ్ టీం అందించిన సహకారానికి ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ టీం సభ్యులు జ్ఞానేశ్వర్, నోముల వీరేష్, వెంకన్న, సుధాకర్, రేఖ వెంకన్న, నర్సింలు, మహిపాల్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీధర్, శ్రవణ్ కుమార్, బుట్ట కృష్ణమూర్తి, మహిపాల్, భైరవ, ప్రసాద్, శ్రీనివాస్, ఆకుల రవీందర్, రవి, కార్తీక్, రెడ్డిపల్లి తదితరులు పాల్గొన్నారు.