తాడ్కోల్ లో సబ్సిడీ కుట్టు మిషన్లు పంపిణీ
ప్రశ్న ఆయుధం 14 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)
గ్రామ స్వరాజ్య సంస్థ అద్వర్యంలో బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 50% సబ్సిడీ కుట్టు మిషన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామ స్వరాజ్య సంస్థ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ…గ్రామ స్వరాజ్య సంస్థ ద్వారా ఈ కుట్టు మిషన్ శిక్షణ లో భాగంగా మహిళల నైపుణ్యత పెంపొందే విధానంలో మహిళలు ముందంజలో ఉండాలని మహిళా సాధికారత సాదించాలన్నారు. అలాగే గ్రామ స్వరాజ్య సంస్థ ద్వారా బ్యూటిషన్,ఎంబ్రైడయిరీ,మగ్గం వర్క్ శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సంస్థ ద్వారా జాబ్ ప్లేసెమెంట్స్ ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రశాంతి గ్రామ పెద్దలు బుడ్మి సొసైటీ చైర్మన్ గంగారాం,వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి,ఐకేపీ సీఏ లు మురళి, ఇంతియాజ్,బాలకిషన్ గ్రామ స్వరాజ్య సంస్థ మండల్ ట్రైనర్ మంజుల సంస్థ టెక్నీషియన్స్ స్వామి తదితరులు పాల్గొన్నారు.