ప్రజావాణిలో ముగ్గురు లబ్ధిదారులకు ఉపకరణాల అందజేత..

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాల మేరకు, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి వెంటనే చర్యలు చేపట్టి ముగ్గురు లబ్ధిదారులకు అవసరమైన ఉపకరణాలను అందజేశారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలను దీర్ఘకాలం వేచి చూడకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పని చేస్తుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి అభ్యర్థనను కేసు వారీగా పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి, అవసరానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం, అత్యంత ప్రాధాన్యతగా ఉందని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి తెలిపారు. తక్షణ స్పందన పై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, నశాముక్త భారత్ అభియాన్ జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందని, దాని భాగంగా మంగళ వారం, సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో *Say No to Drugs ప్రతిజ్ఞ* కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి తెలిపారు. యువతలో మత్తు పదార్థాల మానసిక, శారీరక హానికారక ప్రభావాలపై అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రతిజ్ఞను చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేలా మార్గనిర్దేశం చేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలని సూచించారు. 

Join WhatsApp

Join Now