మందాపూర్ లో ఇంటింటికి చెట్ల పంపిణీ

మందాపూర్ లో ఇంటింటికి చెట్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఇంటింటికి చెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్ పాల్గొని మాట్లాడారు. చెట్లు మానవాళికి జీవనాధారం అన్నారు. కాలుష్యం పెరుగుతున్న ఈ తరుణంలో చెట్లను పెంచడం వలన ప్రతి జీవికి ఆక్సిజన్ సక్రమంగా అంది ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో అబ్బా గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చింతకుంట రాకేష్ రెడ్డి, అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, రోడ్డ రాజు, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, నర్సింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now