బాలికల గురుకుల కళాశాలకు రెండు గ్లీజర్లు వితరణ

*బాలికల గురుకుల కళాశాలకు రెండు గ్లీజర్లు వితరణ*

*మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ మహేష్*

*చొప్పదండి, ,డిసెంబర్ 19* చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలకు రెండు గీజర్లను మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ వితరణగా అందజేశారు ఈ మేరకు పేరెంట్స్ కమిటీ సభ్యులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను కలిసి తమ పిల్లలు చలిలో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని చలి విపరీతంగా ఉందని తెలుపగా ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ మహేష్ ను విద్యార్థులకు గీజర్ అందజేయాలని ఆదేశించారు వెంటనే ఆయన స్పందించి గురుకుల బాలికల విద్యార్థుల కోసం 50 లీటర్ల కెపాసిటీ గల రెండు గ్లిజర్లను గురుకులానికి అందజేశారు. గురువారం కళాశాల ప్రిన్సిపల్ స్వాతికి రెండు గీజర్లను అందజేశారు. ఈ సందర్భంగా గురుకుల కళాశాల సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు విద్యార్థులకు భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కొట్టే అశోక్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు నిజానపురం చందు నాయకులు బండారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now