Site icon PRASHNA AYUDHAM

జిల్లాలోని హోంగార్డులకు ఉన్ని జాకెట్ల పంపిణీ

IMG 20250626 WA0545

జిల్లాలోని హోంగార్డులకు ఉన్ని జాకెట్ల పంపిణీ

— అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కోసం హోంగార్డుల విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, ఐపీఎస్, పర్యవేక్షణలో ఉన్ని జాకెట్లు పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి జిల్లా హోంగార్డులకు ఉన్ని జాకెట్లు మరియు రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ –

“జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు క్రమశిక్షణ మరియు పారదర్శకతతో విధుల్లో పాల్గొనాలి. ప్రజల్లో పోలీస్ శాఖ విలువలను ప్రతిబింబించేలా పనిచేయాలి,” అని సూచించారు.

ఇట్టి కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (హోంగార్డ్స్) N. కృష్ణ మరియు హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version