మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్
*సిద్దిపేట , జనవరి 27
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ & లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ సోమవారం సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ & చేర్యాల మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.