యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

*14446 హెల్ప్‌లైన్ ద్వారా మాదకద్రవ్యాలపై ఫిర్యాదు చేయండి:*

*జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి*

*మాదకద్రవ్య రహిత సంగారెడ్డి లక్ష్యంగా జిల్లా యంత్రాంగం.*

*మిషన్ పరివర్తనలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.*

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేస్తుందని చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం సంగారెడ్డి ఎమ్మెన్నార్ వైద్య కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కె.లలితా కుమారి, జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో “యాంటి డ్రగ్ కమిటీలు” ఏర్పాటు చేసుకోవాలని, ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే జిల్లా యంత్రాంగానికి వెంటనే సమాచారం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సంగారెడ్డిని పూర్తిగా మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ఆయన అన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కె.లలితా కుమారి మాట్లాడుతూ.. విద్యార్థులు మరియు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో అవగాహన పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం “మిషన్ పరివర్తన” కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎవరైనా మాదకద్రవ్యాలను సేవిస్తున్నా లేదా విక్రయిస్తున్నా “నషా ముక్త్ భారత్ అభియాన్ హెల్ప్‌లైన్ నంబర్ 14446”కు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. అనంతరం అధికారులు మాదకద్రవ్యాల దుర్వినియోగంపై పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల అనర్ధాలపై నాటక కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, యువజన క్రీడల శాఖ అధికారి మొఘల్ ఖాసిం బేగ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, దివ్యాంగుల శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఉమేరా సహిష్ట, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment