Site icon PRASHNA AYUDHAM

ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానం

IMG 20250906 WA0091

ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానం

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 6 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు అన్ని రంగాలలో అత్యంత ప్రతిభ కలిగిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ విద్యారంగానికే గర్వకారణి అన్నారు.

ముఖ్యఅతిథి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి ఎంతో గురుతరమైన పవిత్రమైన బాధ్యత కలదని,ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా విజ్ఞానాన్ని,నూతన పోకడలను విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉన్నదని, దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదే ఆధారపడి ఉన్నదనివిద్యారంగంలో వివిధ హోదాలలో 36 సంవత్సరాలు సుదీర్ఘమైన విశిష్ట సేవలు అందించి, ఉపాధ్యాయుడిగా మండల లిటరసీ ఆర్గనైజర్ గా ,మండల రిసోర్స్ పర్సన్ గా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్ గా,కవి రచయిత గాయకుడిగా ఎన్నో అక్షరాస్యత గీతాలను రాసి,పాడి విద్యారంగా అభివృద్ధికి ఎంతోదోహదపడడమే కాకుండా, అటు సాంస్కృతిక కళా రంగాలలోనూ,దళిత అంబేద్కర్ ఇజం లోను,ఆధ్యాత్మిక రంగాలలోనూఎంతో క్రయము చెల్లిస్తూ విశిష్టమైన సేవలు అందిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తో పాటు,అమెరికన్ యూనివర్సిటీస్ నుండి ప్రఖ్యాత డాక్టరేట్ ను కూడా పొంది,

ఎన్నో జాతీయ రాష్ట్ర అవార్డులను సొంతం చేసుకున్న ఆచార్య డాక్టర్ మద్దెలశివకుమార్ నాకు 40 సంవత్సరాలుగా ఎంతో సన్నిహితుడనివారు ప్రభుత్వం తరఫున,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం ఎంతో అభినందనీయమని

ఆచార్య డాక్టర్ మద్దెల, విద్యారంగానికే గాక మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన

ముఖ్యఅతిథి కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు ఉద్గాటించారు.

శాసనసభ్యులు కూనంనేని ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రధానం చేశారు.తొలుత కార్యక్రమ ప్రారంభ దశలో అపరబాలు అల్లి శంకర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తదితరులు మధురంగా గీతాలాపన చేసి అందరినీ అలరించారు.

అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ గొల్లపల్లి దయానందరావు హర్షద్వానాల మధ్య ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని

అభినందించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నుండి ఎంఈఓ లు పీజీ హెచ్ఎంలు పీడీలు ఎస్జీటీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version