సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ యొక్క పని తీరు, సిబ్బంది విధులు, సేవల అమలు విషయంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. భరోసా కేంద్రానికి వచ్చిన బాధితులతో జిల్లాకు చెందిన ప్రిన్సిపల్ జడ్జి స్వయంగా మాట్లాడి వారికి న్యాయ పరమైన సలహాలు, సూచనలు అందించారు. భరోసా సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (డీఎల్ఎస్ఏ) సౌజన్య, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మీ, భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భరోసా సెంటర్‌ను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
Published On: November 15, 2025 4:22 pm