సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సుగుణబాయి

సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సుగుణబాయి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 04

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్డ్ రైస్) పురోగతిని సమీక్షించేందుకు జిల్లా సివిల్ సప్లై మేనేజర్ సుగుణబాయి గురువారం ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా కొల్తూరులోని వెంకటరమణ రైస్ మిల్లును విజిలెన్స్ అధికారులు, రాంపల్లిలోని ఫణీంద్ర ఫుడ్స్ రైస్ మిల్లును ఎఫ్‌సీఐ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రెండు మిల్లుల్లోనూ ఎటువంటి వ్యత్యాసాలు లేవని స్పష్టం చేశారు. మిల్లర్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి, సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీల వల్ల మిల్లర్ల పనితీరులో మరింత క్రమశిక్షణ, వేగం పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు, సివిల్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment