విద్యారంగాన్ని ఉన్నత స్థాయిలో నిలపాలి జిల్లా కలెక్టర్.
ప్రశ్న ఆయుధం
సెప్టెంబర్ 19 కామారెడ్డి
కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. శుక్రవారం రోజున విద్యాశాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎఫ్ ఎల్ ఎన్ బోధనభ్యాసన సామాగ్రి మేళ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మేళాను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల నుండి ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామాగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా విద్యార్థులలో విద్య ప్రమాణాలు మెరుగుపరచుటకై ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఉన్నత విద్యలో విద్యార్థులు రాణించాలంటే అభ్యసన సామాగ్రి వినియోగం ద్వారా విద్య పట్ల ఆకర్షితులను సులభ మార్గం అయితుందని అన్నారు. చక్కటి ప్రదర్శనలను చేసినటువంటి ఉపాధ్యాయులను అభినందిస్తూ పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానం నిలపాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగేందర్, రమణ రావు, పరీక్షల కమిషనర్ బలరాం, డి సి ఈ బి కార్యదర్శి లింగం, ఎంఈఓ లు ఎల్లయ్య,ఆనందరావు, రాజు యూసఫ్,రామస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.