Site icon PRASHNA AYUDHAM

వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

IMG 20250825 182818

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా (బాలుర) సంక్షేమ వసతి గృహాన్ని సోమవారం కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి, వంటశాల, వంట సామగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు. అలాగే విద్యార్థుల హాజరు, చదువు పురోగతి, అధ్యాపకుల హాజరు రిజిస్టర్లు, వసతి గృహ పరిసరాలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాలలో విద్యార్థులకు ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పించిందని, నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు ప్రతి రోజు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వసతి గృహాలలో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు పరిశీలించారు . ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ధనరాజ్, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version